గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ / రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి ఎన్నికైన మీరు క్రమశిక్షణ తో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్ కానిస్టేబుళ్ళ నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళగా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు వెళ్ళుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ళ నియామాకాల్లో సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 150 శిక్షణా కేంద్రం ఖమ్మం, ఆర్ముడ్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 110 శిక్షణా కేంద్రం వికారాబాద్, AR మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 35 శిక్షణా కేంద్రం,మేడ్చల్, సివిల్ మహిళా 86 శిక్షణా కేంద్రం TSPA, హైదరాబాద్ లో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా, అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహలో శిక్షణ అందజేయబడుతుందని. మీరు ఎలాంటి పరిస్థితులోనైనా విజయంగా సాధించే తరహలో శిక్షణ అందించబడుతుందని, మీరూ పొందే శిక్షణతో మీరు పదవీవిరమణ పోందే వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కోనే పోలీస్ అధికారిగా రూపాంతరం చెందుతారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవా చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖ కి మాత్రమే ఉంటుంది అన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించిన మీకు సమాజం లో, కుటుంబంలో మంచి మర్యాద, గౌరవం, గుర్తింపు లభిస్తుంది అన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.