|
modi add 1

సంకరజాతి పశువులకు ఉచిత థైలేరియా వ్యాధి నివారణ టీకాలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట గ్రామాలలో సంకరజాతి పశువులకు ఉచిత థైలేరియా వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ వేణు గోపాల్ రావు, సహాయ సంచాలకులు డాక్టర్ బోనగిరి నరేష్ గార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి మాట్లాడుతూ థైలేరియా వ్యాధి హీమో ప్రోటోజావాన్ పరాన్న జీవి థైలేరియా అన్యులేట వల్ల వస్తుందని తెలిపారు. ఈ పరాన్నజీవి హాయలోమ జాతి గోమర్ల ద్వారా వ్యాపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినపుడు పశువుకి 105 to 106 డిగ్రీల జ్వరం వస్తుంది. స్కేప్పులర్, ఫెమొరల్ లింఫ్ నోడ్స్ వాస్తాయి. వ్యాది గ్రస్త పశువు నోటి నుండి చొంగ కారుతుంది. స్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెడుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పశువు మరణిస్తుంది. 200 రూపాయల విలువ గల థైలేరియా వ్యాధి నివారణ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి డాక్టర్ నరేష్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది కలిక్, పోచయ్య, అంజిత్, పాడి రైతులు , తదితరులు పాల్గొన్నారు. రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని కిష్టంపేట, సింగరావుపేట గ్రామాలలో సంకరజాతి పశువులకు ఉచిత థైలేరియా వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ వేణు గోపాల్ రావు, సహాయ సంచాలకులు డాక్టర్ బోనగిరి నరేష్ గార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి మాట్లాడుతూ థైలేరియా వ్యాధి హీమో ప్రోటోజావాన్ పరాన్న జీవి థైలేరియా అన్యులేట వల్ల వస్తుందని తెలిపారు. ఈ పరాన్నజీవి హాయలోమ జాతి గోమర్ల ద్వారా వ్యాపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినపుడు పశువుకి 105 to 106 డిగ్రీల జ్వరం వస్తుంది. స్కేప్పులర్, ఫెమొరల్ లింఫ్ నోడ్స్ వాస్తాయి. వ్యాది గ్రస్త పశువు నోటి నుండి చొంగ కారుతుంది. స్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెడుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పశువు మరణిస్తుంది. 200 రూపాయల విలువ గల థైలేరియా వ్యాధి నివారణ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి డాక్టర్ నరేష్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది కలిక్, పోచయ్య, అంజిత్, పాడి రైతులు , తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1