|
modi add 1

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

సుల్తానాబాద్,ఫిబ్రవరి 26 (జనం గొంతు): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 25వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంఫు,కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట,స్పారింగ్ విభాగంలో బంగారు పథకం సాధించగా ఎస్ సృజన్,ఏ విశ్వాస్ కట విభాగంలో బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే వలన మంచి క్రమశిక్షణ ఏర్పడుతుందని తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

జాతీయ కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించాడు.ఈ నెల 03వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి లో 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే,కుంగ్ ఫు చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట, కుమ్మిత్ విభాగంలో బంగారు పతకాలు సాధించాడు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఆల్ఫోర్స్ విద్యార్థి ఛాంపియన్ షిప్

విద్యార్థిని అభినందించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇటీవల వేములవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో మల్యాల ఆల్ఫోర్స్ స్కూల్ కి చెందిన కె. అశ్వద్దామా అండర్ - 14 ఇయర్స్ కుమితే ( ఫైట్ ) విభాగం లో పాల్గొని విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ తో పాటు ఓవర్ ఆల్ గ్రాండ్ ఛాంపియన్ షిప్ సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కటా , కుమితే ( ఫైట్ ) సబ్ - జూనియర్, జూనియర్, క్యాడేట్, సీనియర్ బాలుర విభాగాల్లో పాల్గొన్న ఆల్ఫోర్స్ క్రీడాకారులు శ్రీజ , స్నేహర్షిత, రిషిక,మేధశ్రీ, శ్రీనిధి, సహర్ష్, శ్రీచరణ్, అక్షిత్, అఖిలేష్ ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి పలు పథకాలు సాధించినట్టు వివరించారు. పథకాలు సాధించిన విద్యార్థులనుద్దెశించి మాట్లాడుతూ కరాటే నేర్చుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం పెంపొందుతుందనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య అయిన కరాటే ను తప్పకుండ నేర్చికోవాలన్నారు ఈ సందర్బంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్, కరాటే మాస్టర్ ఎం. శ్రీనివాస్,అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

మండల స్థాయి సీఎం కప్ పోటీలలో గ్రీన్ వుడ్ విద్యార్థుల విజయకేతనం

రాయికల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో జరిగిన మండల స్థాయి సీఎం కప్పు పోటీలలో గ్రీన్ వుడ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు దీనిలో గర్ల్స్ విభాగంలో మండల స్థాయిలో వాలీ వాలీబాల్ విభాగంలోమొదటి స్థానం లో మరియు ఖో ఖో విభాగంలో రెండో స్థానంలో నిలిచారు.దీనిలో ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శైలేంద్రనీ రెడ్డి మరియు రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు,ఎంపీడీవో బి.చిరంజీవి, మండల విద్యాధికారి రాఘవులు పిడి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ పాఠశాలల పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ శైలేంద్రిని రెడ్డి విద్యార్థులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

By Gantyala Praveen | January 28, 2026 | 0 Comments

Hot Categories

2
8