|
modi add 1

జర్నలిస్ట్ గంగాధరి సురేష్ కి లెజెండరీ అవార్డు

ప్రముఖ సేవా సంస్థ అయినా అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, స్వాతంత్రం సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక దినాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో సేవలందించి ప్రతిభ వంతులకు ఈనెల 10 తేదీన లెజెండరి అవార్డులు ప్రధానం చేయునున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన జర్నలిస్ట్ గంగాధరి సురేష్ ని కోడి రామకృష్ణ లెజెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్. సరోజనమ్మ తెలిపారు.ఈ నెల 10 తేదీ రోజున హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు, విశిష్ట అతిథుల చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకోనున్నారు.ఈ అవార్డు కి ఎంపిక అయినందుకు గాను జర్నలిస్టు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సురేష్ ను అభినందించారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు ఫౌండర్ ప్రెసిడెంటు, అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్.సరోజనమ్మ కి కృతజ్ఞతలు తెలిపారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1