గోదావరిఖని, సెప్టెంబర్ 30: అజాగ్రత్తగా యాష్ ట్యాంకర్‌ను నడిపి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఫార్మసిస్ట్ ఎర్రంబోతు సుజనా మృతికి కారణమైన కేసులో ట్యాంకర్ డ్రైవర్ దావూద్ షేక్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ గోదావరిఖని 1వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ రామగిరి స్వారిక బుధవారం తీర్పు వెలువరించారు. 2018 ఫిబ్రవరి 21న విధులు ముగించుకుని జూపిటర్ మోపెడ్‌పై ఎన్టీపీసీలోని తన ఇంటికి వెళ్తున్న సుజనను రాజీవ్ రహదారిపై కవిత థియేటర్ దాటి లయన్స్ భవన్ ఎదురుగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి కుమారుడు రాహుల్ మండేల ఫిర్యాదు మేరకు అప్పటి గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.డి. కరీంబేగ్ కేసు నమోదు చేసి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు డ్యూటీ అధికారులు అభి, ఎం. ఉదయ్, హోంగార్డు కె. తిరుపతి సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, ఏపీపీ నహీద ఫర్హీన్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.