వర్షాకాలానికి ముందే వరద ముప్పును నివారించేందుకు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పి.కె. రామయ్య కాలనీలో కాలువల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, రహదారుల విస్తరణ పనులను పరిశీలించారు. మేయర్ ఆదేశాల మేరకు జేసీబీలు, ట్రాక్టర్లు, జెట్టింగ్ యంత్రాలతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించారు. భూగర్భ జలాల పెంపు కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అవసరమైతే 1వ డివిజన్‌లో మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, ఎస్‌ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.