|
modi add 1

బ్రాహ్మణ సేవా సమితి ఎన్నికలు

గోదావరిఖని: సెప్టెంబర్ 26, 2026న గోదావరిఖనిలోని ప్రశాంత్ నగర్ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఎన్నికలకు సంబంధించి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షులుగా రుద్రభట్ల ప్రవీణ్ , ప్రధాన కార్యదర్శిగా అత్తెన చంద్రశేఖర్ శర్మ, ఉపాధ్యక్షులుగా దెబ్బెట అశోక్ చార్య,ట్రెజరర్‌గా కల్వచర్ల మురళి గారిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులు తమ పదవీకాలంలో బ్రాహ్మణ సేవా సమితి అభివృద్ధి కోసం కృషి చేస్తామని, సమితి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో పనిచేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల అధికారులుగా తనుగుల ఆంజనేయ శర్మ , మూగు హరినాథ్ శర్మ వ్యవహరించారు.

By Ambati Sathish kumar | September 27, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1