|
modi add 1

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ప్రజలు, బాధితులు తమ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కమిషనర్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | September 28, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1