జగిత్యాల బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం స్కూటీని కొనుగోలు చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్కు ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. స్కూటీ కాలిపోగా, ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి.
Your experience on this site will be improved by allowing cookies.