|
modi add 1

ఏజెన్సీ దళితుల సమస్యల పరిష్కారానికి జేఏసీ వినతి.. సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి శ్రీధర్‌బాబు

ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న దళిత కుటుంబాల సమస్యలను పరిష్కరించి, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చినట్లు ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పోరాట జేఏసీ నాయకులు తెలిపారు\. శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ మార్షల్‌ దుర్గం నగేష్‌ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించింది\. అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేసింది\. ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా సాగు భూములను అనుభవిస్తున్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో అనేక కుటుంబాలు రైతు భరోసా, బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయని జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు\. అర్హులైన ఎస్సీ కుటుంబాలకు సాగు భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని, భూ బదిలీలు, వారసత్వ ఆస్తుల విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు\. అలాగే అర్హులకు ఉచిత ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు\. రాజకీయ ప్రాతినిధ్యం, దళిత యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు\. గిరిజనుల భూ హక్కులకు భంగం కలగకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు\. జేఏసీ ప్రతినిధులు వివరించిన సమస్యలపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందిస్తూ, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు\. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం సీనియర్‌ నాయకుడు జాడి రాజయ్య, సమతా సైనిక దళ్‌ నాయకులు ముడిమడుగుల సురేష్‌, రామటెంకి విశ్వనాథ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు

By Ambati Sathish kumar | October 10, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1