సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్‌లోని శివాలయం, హనుమాన్ ఆలయాల పరిసరాల్లో శనివారం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా లేబర్ సెల్ కో-కన్వీనర్ ఎల్తూరి రాజయ్య ఆధ్వర్యంలో, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని పిచ్చి చెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించి ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆలయ విగ్రహాలను సైతం శుద్ధి చేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ స్వచ్ఛత, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ తడగొండ నరసయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత, చిలుముల నరేందర్, జక్కుల పద్మ, కోడూరు రమేష్, జక్కుల ప్రవీణ్, గజ్జల భాస్కర్, జక్కన బాలు, సిలారపు కళ్యాణ్, బెక్కం స్వప్న, బుంగ మహేష్, అక్కపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.