|
modi add 1

అధికారుల నిర్లక్ష్యంపై నిరసన.. సొంత డబ్బులతో రోడ్ల గుంతలు పూడ్చిన 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా మహేష్

ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా మహేష్ వినూత్న నిరసనకు దిగారు. ఏళ్ల తరబడి గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో సుమారు రూ.లక్ష సొంత నిధులతో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. డివిజన్‌లోని రోడ్ల దుస్థితిపై గత ఆరు నెలలుగా మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగుసార్లు గుంతల కొలతలు తీసి అంచనాలు సిద్ధం చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదని తెలిపారు. బతుకమ్మ పండుగ సమయంలోనూ మహిళలు వేడుకలు నిర్వహించే ప్రాంతంలో గుంతలు పూడ్చాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సొంత డబ్బులతో మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపైనా చూపించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 51వ డివిజన్‌లో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ ఆకారపు రేఖా మహేష్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

By Ambati Sathish kumar | October 10, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1