రాయికల్ పట్టణంలోని 10వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో జాతీయ 'పోషకాహార మాసోత్సవం' కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారుల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేయించుకోవాలని,మొదటి వెయ్యి రోజుల పోషణ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమని సూచించారు. పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక రోగాలను దూరం పెట్టవచ్చని తెలిపారు.ఆరేళ్ల లోపు చిన్నారులకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఆరోగ్య రక్షణ,పౌష్టికాహారం పై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ గంగ లక్ష్మి, అడ్వకేట్ మచ్చ శేఖర్,యూత్ నాయకులు బాపూరపు రాజీవ్,హెల్త్ సూపర్వైజర్ ఉమారాణి,ఏఎన్ఎమ్ ఫాతిమా,అంగన్వాడి ఉపాధ్యాయులు పుష్పలత,ఉమారాణి, సిందూరి,వనిత,ఆశాలు విజయలక్ష్మి,సరిత,వసంత,ఆయా విజయలక్ష్మి,నాయకులు బాపురపు రాజీవ్, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.