|
modi add 1

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు

ఈ రోజు వేంకటా పూర్ మండలం బూర్గుపేట గ్రామానికి చెందిన బినవేని శ్రీలత ఆనందపూర్ గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మీ మరియు ఆకులవారి పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ లు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పొరిక బలరాం నాయక్ గార్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

ముంపు ప్రాంతాలను సందర్శించిన జగిత్యాల ఎస్పి

జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాభావ పరిస్థితులను దృష్ఠిలో ఉంచుకొని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాయికల్ మండలంలోని జగన్నాథపురం , నాయకపోడు, మరియు బోర్నపల్లి గ్రామాలను సందర్శించి, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోదావరి నది మరియు కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పుడు పోలీస్ శాఖ తరుపున ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటామని గ్రామస్థుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్థులకు భరోసా కల్పించారు. అదే విధంగా గోదావరిలోకి చేపల వేటకు, పశువుల మేతకు ఎవరూ కూడా వెళ్లవద్దని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పి వెంట జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్, జగిత్యాల. రూరల్ సీఐ కృష్ణారెడ్డి, రాయికల్ ఎస్ ఐ అశోక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By Gantyala Praveen | July 27, 2024 | 0 Comments