రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గా బి. చిరంజీవి బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ నుండి రాయికల్ మండలానికి బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తమకు తెలియజేయాలని వాటిని పరిష్కరించే దిశగా తాము కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు.
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న 300 మందికి శ్వేత ట్రేడర్స్ అధినేత లయన్ జెడ్ సి కాటిపెళ్లి రామ్ రెడ్డి లత 25వ వివాహమహోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమాన్లు, కంటి వైద్యులు డాక్టర్ ప్రభాకర్,లయన్స్ క్లబ్ డిసీలు మ్యా కల రమేష్,బత్తిని భూమయ్య,అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి,ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్,కోశాధికారి గంట్యాల ప్రవీణ్,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,కనపర్తి శ్రీనివాస్, ఎద్దండి దివాకర్,బొమ్మ కంటి నవీన్,మండలోజు శ్రీనివాస్,పారిపెల్లి శ్రీనివాస్,ఆడెపు రాంప్రసాద్,కుర్మా సుదర్శన్,కొత్తపెళ్లి రంజిత్,సామల్ల గోపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.