- నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ . శ్రీకాంత్ మున్సిపల్. గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ /. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈ రోజు పారిశుద్ధ్య విభాగం సూపర్ వైజరీ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ లోపాలు సరిదిద్దుకుంటూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు. పారిశుద్ధ్య వాహనాలన్నీ పని చేసేలా చూడాలని అన్నారు. సమస్య దృష్టికి వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త , పొడి చెత్త వేర్వేరుగా స్వీకరించాలని అన్నారు. చెత్త బయట పడ వేసిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. నగరాన్ని చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కు వేలాది భక్తులు విచ్చేస్తునందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌళిక వసతులు కల్పించాలని అన్నారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బంది సేవలను షిఫ్ట్ ల వారీ గా ఉపయోగించుకొని జాతర పరిసరాలు , ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు , సెక్రెటరీ జి. రాజు , సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ సుందర్ , సునీల్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , సానిటరీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.