సుల్తానాబాద్,జూన్ 27(జనం గొంతు): సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రం పూసాలలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు గురువారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి డప్పు చప్పుళ్ల, నడుమ బోనాలు శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించారు.ఈ సందర్భంగా గుర్రాల మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ గా వస్తుందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం,వైస్ ప్రెసిడెంట్ చొప్పరి శ్రీనివాస్, కార్యదర్శి కంకణాల సతీష్, 14వ వార్డు కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్,డైరెక్టర్లు సనవేణి లక్ష్మయ్య, కంకణాల కనకయ్య, భూత గడ్డ కనకయ్య, ఉస్తేం లక్ష్మీనారాయణ, కంకణాల శ్రీనివాస్, పోచవేణి రవి, మాజీ ఎంపీటీసీ కంకణాల ఆశాలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ ప్రెసిడెంట్ ఉస్థెo రవి,సిద్ధ తిరుపతి పురం రమణ, గుర్రాల కిరణ్, మహిళలు యువతి యువకులు ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.