కుటుంబ వ్యవస్థను సంరక్షించి, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పలువురు మహిళా వక్తలు పిలుపునిచ్చారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో బుధవారం ఉదయం మహిళా సమ్మేళనం జరిగింది. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళటం శుభ పరిణామం అని, సైన్యంలో సైతం నారీ శక్తి చాటబడినదని పేర్కొన్నారు. కుటుంబంలో స్త్రీలు ఇచ్చే సంస్కారాల వలన రాబోయే తరం జాతి నిర్మాతలు గా తీర్చిదిద్దబడుతారని అన్నారు. కుటుంబం అంటే సంబంధ బాంధవ్యాల నిలయమే కాదు, సమరసతా, సమానత ల ఆలయం అని వివరించారు. ప్రతి ఇల్లు అందరినీ ఆదరించే ధర్మ స్థలం అని చెప్పారు. పిల్లలకు మన ధర్మం, దేశం పట్ల అవగాహనను పెంపొందించాలని సూచించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.