|
modi add 1

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 కి, డీజిల్ పై 10 నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఉపశమనం చేకూరింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో పెట్రోల్ ఇంధన కొరత తీవ్రంగా వుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు వరకూ వెళ్లిందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేరక ఇంధన ధరలు పెరిగాయని, కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, వీటిని పెంచలేదన్నారు. అలాగే చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించుకున్నామని, అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించామన్నారు. లాక్ డౌన్ విధింపు వార్తలన్నీ అవాస్తవమే : కేంద్రం క్లారిటీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఏర్పడిన పరిస్థితులు ,ఇంధన కొరత నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవమేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఎనర్జీ, సరఫరా గొలుసు, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని, గందరగోళం సృష్టిస్తాయని అన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతతతో మెలగాలని పిలుపునిచ్చారు.

By NYALAKONDA ANIL DESAI | March 27, 2026 | 0 Comments