రాయికల్ పట్టణంలోని విస్డం హైస్కూల్లో విద్యార్థుల మానసిక , వ్యక్తిత్వ వికాస పరిణితి కోసం విశ్వతేజాస్ ట్రైనింగ్ మరియు కౌన్సిలింగ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. సమాజంలో మారుతున్న పోకడలకు, విద్యా వ్యవస్థలో అనునిత్యం జరుగుతున్న మార్పులకి, పిల్లల్లో చోటుచేసుకుంటున్న టెక్నాలజీ వ్యసనం లాంటి వాటినుండి మేలుకొలుపడానికి విస్డం హై స్కూల్ కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి శ్రీకారం చుట్టారు. విశ్వతేజాస్ ఫౌండర్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లైఫ్ కోచ్ తిరునగరి శ్రీహరి "విజన్ టు విక్టరీ" అనే అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే సృజనాత్మకత,వారు చేసే పనులలో అనుశాసనం, క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసం అత్యవసరమని కథల ద్వారా కళ్ళకు కట్టినట్లు వివరించారు. మరో వక్త, తైక్వాండో శిక్షకులు నరహరి నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పరచుకునే లక్ష్యం స్పష్టంగా ఉండాలని అనుక్షణం లక్ష్యాన్ని స్మరిస్తూ సాధన చేయాలని తల్లి తండ్రి గురువులకు గౌరవం ఇవ్వాలని మనకు సహాయం చేసే వారిపట్ల నిత్యం కృతజ్ఞత తో మెదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎద్దండి నివేదిత రెడ్డి,విశ్వతేజాస్ డైరెక్టర్ ప్రసన్న, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.