రాయికల్ మండలము లోని అల్లిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా సహకార అధికారి రఘువరన్ ఆకస్మికముగా తనిఖీ చేసి రుణమాఫీ ఖాతాలను, ఫర్టిలైజర్స్ స్టాక్స్ ను పరిశీలించి తగు చూచనలు చేసినారు. ఋణ మాఫీ అయిన రైతులకు తొందరలోనే మళ్ళీ రుణాలు అందజేయవలెనని రైతులకు ఎరువులు పి.ఓ.యస్ మిషన్ ద్వారానే అమ్మకం జరపాలని ఎరువుల నిలువలు రైతులకు అందుబాటులో ఉంచవలేనని సంఘ కార్యదర్శి ఉపేందర్ ను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు రాజలింగం, సంఘ ఆడప్షన్ అధికారి సాయి కుమార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ , సంఘ కార్యదర్శి ఉపేందర్ , బి. సురేష్, గంగాధర్ నాగరాజు తదితరులు ఉన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.