ఉచిత మెడికల్ క్యాంపులో ముందస్తు వ్యాధి నిర్ధారణతో ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు పొందవచ్చు మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శనివారం రాయికల్ పట్టణంలోని శ్రీ సత్య హాస్పిటల్, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుశీల్,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అందే ఉదయ్ కుమార్ లు150 మందిని పరీక్షించి అవసరమైన వారికి ఈసీజీ, టుడి ఈకో,బిపి,షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి రోగులకు పలు వైద్య సూచనలు అందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధించిన వ్యాధులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి ఉచిత గుండె వైద్య శిబిరంతో వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ వైద్యుల సేవలను గ్రామీణ స్థాయి ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అందించిన శ్రీ సత్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ ను అభినందించారు. రాయికల్ మండల ప్రజలకు భవిష్యత్తులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,ఎస్సై అశోక్, మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ రమేష్,మాజీ ఎంపీపీ లౌవుడియా సంధ్యారాణి సురేందర్,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామీణ వైద్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.