సుల్తానాబాద్,ఫిబ్రవరి 26 (జనం గొంతు): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 25వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంఫు,కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జి హర్షవర్ధన్ కట,స్పారింగ్ విభాగంలో బంగారు పథకం సాధించగా ఎస్ సృజన్,ఏ విశ్వాస్ కట విభాగంలో బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే వలన మంచి క్రమశిక్షణ ఏర్పడుతుందని తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.