రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి భీష్మ ఏకాదశి సందర్భంగా రాయికల్ గంగపుత్రా యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటిక్యాల రోడ్ 8వ వార్డ్ లో గంగపుత్రుల పితామహులు భీష్ముని పథకాన్ని ఎగురవేసి ఘనంగా భీష్మ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు తోపరాపు రవీందర్ మాట్లాడుతూ భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము. మన పూర్వీకులచరిత్రని మరువద్దు అని గంగాదేవి పుత్రులుగా భీష్మ వంశ వారసులుగా గంగపుత్రులు మన కులానికి అదృష్టంగా భావించాలి అని సభ్యులనుధ్చేసించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కల్లేడ సునీత మండల గంగపుత్ర యువజన అధ్యక్షుడు కల్లేడ ధర్మపురి.ఫిషర్ మెన్ యూనియన్ అధ్యక్షులు సురేష్ సభ్యులు మహేష్ రంజిత్,కిరణ్, గంగాధర్,అశన్న రమేష్,రాజు గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.