పట్టణంలో పీర్లగుట్టపై ప్రజల ఆర్తనాదాలు వినండి. గొంతు ఎండిపోతున్న ప్రజలకు నీరు తాపండి ప్రజాప్రతినిధులారా అధికారులారా ప్రజలు కట్టిన పన్నుపై జీతాలు తీసుకొని వారి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా? వారికి సేవ చేయoడని డబల్ బెడ్ రూమ్ లో నివసించే ప్రజలకు పలు కష్టాలు ఉన్నాయని వాటిని వెంటనే తీర్చాలని ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వెళ్లి పరిశీలించి డిమాండ్ చేసింది. వనపర్తి లో నెలకొన్న సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక మోటార్ సైకిళ్ల పై తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలుసుకొని బహిరంగ లేఖ రాస్తూ పత్రికా ముఖంగా పాలకపక్షాలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి పలు డిమాండ్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉండే పలు పార్టీల నాయకులతో కలిసి మోటార్ సైకిళ్ల పై బయలుదేరి డబల్ బెడ్ రూమ్ ల సమస్యలపై తిరుగుతూ పీర్లగుట్ట ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదికకు ఇచ్చిన దరఖాస్తు పై వెళ్లి చూడగా అక్కడ నీటి సమస్య, కరెంటు సమస్య, శానిటరీ సమస్యలు రోడ్డు సమస్యలతో విలవిలలాడుతున్నారని వారి ఆర్తనాదాలు ఎవరికి వినిపించలేదని, రాజకీయాలు విడిచిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.