రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) లో సోమవారం ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటాన్ని పూలతో అలంకరించారు.ఈ సందర్భంగా దాశరథి జీవితం విశేషాలు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు . ఉపాధ్యాయులు మాట్లాడుతూ దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక రచనలు చేశారని తెలిపారు.అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం వంటి ప్రసిద్ధ రచనలు చేశారని చెప్పారు.నాటిపాలకులు అతన్ని నిజామాబాద్ జైలు లో బంధిస్తే జైలు గోడల మీద పద్యాలు రాశారని అన్నారు .మంచి సాహిత్యం గల అనేక సినిమా పాటలు అందించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం చివరి ఆస్థాన కవి దాశరథి అని వివరించారు.కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు రాష్ట్ర సాహిత్య అవార్డులు అందుకున్నారని చెప్పారు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగిన కవి దాశరథి కృష్ణమాచార్య అని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు పి.రాజశేఖర్ ఉపాధ్యాయులు జె.రాజేశం, చెరుకు మహేశ్వర శర్మ, కె.ప్రశాంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.