నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తెరవడమే కాకుండా, వాటిని దళారీల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్ డౌన్’’ పేరుతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా ఈ మోసం బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన ఖాసీం (25), షర్బతి కాలువకు చెందిన సయ్యద్ హఫీజ్ (32), రేంజల్ బస్ కి చెందిన మహ్మద్ అజర్ (28), మహ్మద్ అజర్ (28), మినాజ్ అహ్మద్ (35) ను అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా గత మూడు నెలల్లోనే ఏకంగా 31 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించామని సీపీ సాయి చైతన్య ప్రకటించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.