రాయికల్ మండలంలోని అతి పురాతనమైన శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి (త్రికుటాలయం)లో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథంలో శివపార్వతుల ఉత్సవాలను ఉంచి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదానంలో సుమారు 5000 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, వార్డ్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణానికి చెందిన కోచ్ కనుక ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 6 గంటలకు కుంఫుడో , మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులచే అన్ని రకాల యోగాసనాలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి రోజూ యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు మరియు ఆలోచనా విధానంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాక, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుందని తెలియజేశారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.