రాయికల్ మండలం రాజనగరం గ్రామానికి చెందిన జిన్న చిన్న మల్లేష్ అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కాగా ఆలూరు కి చెందిన మాజీ సర్పంచ్ ,భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా నాయకులు మెక్కొండ రాంరెడ్డి జగిత్యాలలోని మణికంఠ హాస్పిటల్ లో రక్తహీనతతో చికిత్స పొందుతున్న మల్లేశంకు రక్తదానం చేశారు . ఈసందర్బంగా మెక్కొండ రాంరెడ్డి మాట్లాడుతూరోడ్డు ప్రమాదాలు, కేన్సర్ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దకాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్తనిల్వలు సరిపడా ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ప్రతీ వ్యక్తి స్వచ్చందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం. ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ పలువురికి స్ఫూర్తి నిస్తు 37 సార్లు రక్తదానం చేసే అవకాశం రావడం నాకు ఆనందంగా ఉంది అని అన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.