పశ్చిమబెంగాల్ రాష్ట్రం రాజధాని కోల్ కతా ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జరిగిన వైద్య పీజీ విద్యార్థి పై జరిగిన సామూహిక అత్యాచారం పాట్ల రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలతో ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శశికాంత్ రెడ్డిమాట్లాడుతూ, సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే బాధిత కుటుంబానికు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వైద్యం అందిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులపై ఇలాంటి హత్యాకాండకు పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శారీరక ఉన్మాదులపై ఉక్కు పాదం మోపే విధంగా చట్టాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సతీష్, శ్రీకాంత్, ఉదయ్, రజిత, తేజస్విని, వాణి,ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.