రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు ఆడిటోరియం,మినరల్ వాటర్ ప్లాంట్,ఐ.ఎఫ్.పి ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,రాయికల్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పాఠశాలలో ఇలాంటి వసతులు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని,విద్యార్థులంతా ఇష్టపడి చదివి తమ లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులలో దాగి ఉన్న కళలను వెలికి తీయడానికి ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి వసతులు ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్యాన్ని అతిధులు యాజమాన్యాన్ని అతిధులు అభినందించారు.అనంతరం పాఠశాల యాజమాన్యం ఎస్సై అశోక్ ని,ఆర్టిస్ట్ మారుతిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్,ప్రెస్ క్లబ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.