రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాల లో విద్యార్థులు ముందుస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ ఉట్టికొట్టె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ అవతారంలో పరమాత్మ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం పనిచేస్తూ గీతను ఉపదేశించాడని, దేవుడు ఒకడేనని దేవుడిని హిందువులు శ్రీకృష్ణుడిగా, ముస్లీం లు అల్లాహ్ గా, క్రైస్తవులు జీసస్ గా ఎవరికి ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని సేవించు కుంటారని, కేవలం భారతదేశంలో మాత్రమే సర్వమత సమ్మేళనం, సామరస్యత కనిపిస్తుందని అన్నారు. దుష్టశిక్షణ శిష్ట రక్షణ కు పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా అవతరించాడని అన్నారు. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణ దాల్చి కోలాటం చేస్తు నృత్యాలు చేసారు. పిల్లలకు మిఠాయిలు బిస్కెట్స్ అందజేశారు. వేషధారణ చేసిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు గా పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, పునుగోటి హన్మంతరావు, ముక్కెర శేఖర్, ఎద్దండి రమేష్ రెడ్డి, పర్లపెల్లి స్వర్ణలత, బూర్ల శ్రీలత, రౌతు నీరజ, సీడెం లింగయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.