వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. విద్య, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి జ్యోతిష్య జ్ఞానరత్న బ్రహ్మశ్రీ మునిగోటి రమేష్ శర్మ ఆధ్వర్యం వహించి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులచే, మాతల చే కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తరువాత సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరిపి, చిన్నారుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలే శేఖర్ మాట్లాడుతూ, “విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సంస్కారాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి. అలాంటి లక్ష్యంతోనే ప్రగతి ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం శ్రీ పంచమి వేడుకలను నిర్వహిస్తూ, విద్యార్థుల్లో జ్ఞానదీప్తిని వెలిగిస్తోంది. సామూహిక అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులు ఎవరైతే కొత్తగా చేరారో వాళ్లకు ఫ్రీ అడ్మిషన్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బాలె జయశ్రీ శేఖర్ ,పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ శ్రీ పంచమి వేడుకలు అందరిలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.