- రామగుండం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన విశ్వహిందూ పరిషత్ గోదావరినదిలో పుష్కరఘాట్కు కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు కలుగకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా గోదావరినదిలో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఒడ్డున మరియు దారుల వెంట పారిశుధ్య నిర్వహణతో గోదావరి వద్ద భక్తులు వేసవి దృష్ట్యా ఎండలో వేచి ఉండేలా కాకుండా నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, గోదావరినది ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయడంతో పాటు షవర్లు ఏర్పాటు చేయాలి,తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు మంచినీటి సౌకర్యం, తగినంత మంది లైఫ్ సేవర్స్ మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, సహ కార్యదర్శి కొండపర్తి లింగన్న,సంపత్, నగరబజరంగ్దళ్ సంయోజక్ దిగంబర్ సహసంయోజక్ అరవింద్, ఆరెల్లి జలంధర్, చక్రపాణి, బాలు,అనిల్,కిరణ్, సురేష్, కార్తీక్, దుబాసి తిరుపతి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.