|
modi add 1

ఆదివాసిలతో కలిసి ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రాయికల్ మండలం లోని జగన్నాథ్ పూర్ లో ఆదివాసి నాయకులతో కలిసి ముందస్తురక్షాబంధన్ వేడుకలు చేయడము జరిగింది. ధర్మ జాగరణ ప్రముఖ్ మాట్లాడుతూ విశ్వశాంతిని కోరే ధర్మం హిందూ ధర్మమేనని హిందువుల జాగృతి కోసం ధర్మజాగరణ ఎప్పుడు పనిచేస్తుందని అందులో భాగంగానే ఇంటింటికి రక్షాబంధన్ కార్యక్రమాన్ని తీసుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ ప్రముఖ్ సురేందర్, పెందూరు సుధాకర్ పటేల్, ఆత్రం సచిన్ రాజ్, పరచ ఈశ్వర్, ఆత్రం అర్జున్ ఆత్రం రాము గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 17, 2024 | 0 Comments