రాయికల్ పట్టణం లోని పలు కాలనీలో రోజురోజుకు విష జ్వరాలు పెరుగుతున్నాయి ప్రతి ఇంట్లో ఒకరు, ఇద్దరు విష జ్వరాలు బారిన పడుతున్నారు పారిశుద్ధ్య నిర్వహణలో రాయికల్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం కారణంగానే దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నట్టు పట్టణంలోని మత్తడి వాడ,కేశవ నగర్,ఇంద్రానగర్ కాలనీలకు చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాలనీలో సానిటైజేషన్ కోసం వేల రూపాయలు వెచ్చించి మిషన్లు కొనుగోలు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు వినియోగించకపోవడం మున్సిపల్ కార్యాలయంలోనే అలంకారప్రాయంగా మారాయని అంటున్నారు. వారంలో ఒక్కసారైనా ప్రతి కాలనీలో డ్రైనేజీలు తీయక మురుగు నిలచి దుర్గంధం వెదజల్లుతుంది మురుగు కుపాలను పందులు,దోమలు ఆవాసంగా చేసుకున్నాయి. గాంధీ చౌక్, నాగారం వాడ, అశోక్ నగర్, కాలనీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. డ్రైనేజీ లేక ఇళ్ల ముందటే మురుగు నిలుస్తుంది మురుగు కాలువలో పూడిక పేరుకుపోయి దోమలు పెరుగుదలకు కారణమైనట్టు వారు తెలుపుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాలనీలకు చెందిన ప్రతి ఒక్కరు కోరుతున్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.