ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలి.....రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు పురుషులతో సమానంగా ఆడపిల్లలకు ఆధునిక విద్య అందించాలనే లక్ష్యంతో సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు పద్మజ,పాతిమబేగం,వనిత, తిరుమల,పద్మ,తరంగిణి,రజిత,హైమవతి,హర్షియ,స్వరూప లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేత కు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్,మాజీ జడ్ సి లు మ్యాకల రమేష్,కార్యదర్శి కడకుంట్ల నరేష్,క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్, బొమ్మకంటి నవీన్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్,శ్రీనివాస్, ఉపాధ్యాయులు పారిపెళ్లి గంగాధర్,సత్యం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.