జనంగొంతు//గోదావరిఖని //ఆదివారం రోజు ఉదయం పద్మావతి కాలనీవాసులు సుమారు వంద మంది కుటుంబ సమేతంగా గత పది సంవత్సరాల నుండి పరిష్కారం కానీ రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలపై స్థానిక రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాగూర్ క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతి పత్రం అందిచారు, రాజీవ్ రహదారి స్కూప్స్ (కవిత టాకీస్) ఐస్ క్రీమ్ పార్లర్ నుండి కోర్టు వెనకాల వరకు గల మెయిన్ రోడ్డు ను తవ్వి మట్టి తీసి ఉంచడం వల్ల కాలనీకి స్కూల్ వ్యాన్సు మరియు ఆటో మరియు అండర్ గ్రౌండ్ కుండీలు పగిలి నీరు రోడ్డు మీదకు రావడం వల్ల పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే కి విన్నవించుకోవడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటి పరిష్కారము అయ్యేవిధంగా చూస్తానని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి పద్మావతి కాలనీవాసులు అందరూ కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.