|
modi add 1

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

సుల్తానాబాద్,ఫిబ్రవరి 26 (జనం గొంతు): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 25వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంఫు,కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట,స్పారింగ్ విభాగంలో బంగారు పథకం సాధించగా ఎస్ సృజన్,ఏ విశ్వాస్ కట విభాగంలో బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే వలన మంచి క్రమశిక్షణ ఏర్పడుతుందని తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 26, 2024 | 0 Comments

జాతీయ కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించాడు.ఈ నెల 03వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి లో 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే,కుంగ్ ఫు చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట, కుమ్మిత్ విభాగంలో బంగారు పతకాలు సాధించాడు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఆల్ఫోర్స్ విద్యార్థి ఛాంపియన్ షిప్

విద్యార్థిని అభినందించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇటీవల వేములవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో మల్యాల ఆల్ఫోర్స్ స్కూల్ కి చెందిన కె. అశ్వద్దామా అండర్ - 14 ఇయర్స్ కుమితే ( ఫైట్ ) విభాగం లో పాల్గొని విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ తో పాటు ఓవర్ ఆల్ గ్రాండ్ ఛాంపియన్ షిప్ సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కటా , కుమితే ( ఫైట్ ) సబ్ - జూనియర్, జూనియర్, క్యాడేట్, సీనియర్ బాలుర విభాగాల్లో పాల్గొన్న ఆల్ఫోర్స్ క్రీడాకారులు శ్రీజ , స్నేహర్షిత, రిషిక,మేధశ్రీ, శ్రీనిధి, సహర్ష్, శ్రీచరణ్, అక్షిత్, అఖిలేష్ ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి పలు పథకాలు సాధించినట్టు వివరించారు. పథకాలు సాధించిన విద్యార్థులనుద్దెశించి మాట్లాడుతూ కరాటే నేర్చుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం పెంపొందుతుందనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య అయిన కరాటే ను తప్పకుండ నేర్చికోవాలన్నారు ఈ సందర్బంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపాల్, కరాటే మాస్టర్ ఎం. శ్రీనివాస్,అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు డో,కరాటే పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కూంఫు కరాటే ఛాంపియన్ షీప్- 2025 లో కూంఫు డో,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కనుక ప్రభాకర్, కనుక ప్రవీణ్ కుమార్ మరియు హరికృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రాయికల్ కు చెందిన 18 మంది కూంఫు డో విద్యార్థులకు 16 బంగారు పతకాలు, రెండు వెండి పథకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కూంఫు డో , మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం వల్ల శారీరకంగా,మానసికంగా ధృడత్వం పెరిగి స్వీయ రక్షణలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.

By Gantyala Praveen | December 08, 2025 | 0 Comments

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కరాటే ఎంతో దోహదపడుతుంది .. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్, కరాటే ఎంతో దోహదపడుతుందని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ అన్నారు.ది ఇంటర్నేషనల్ హుయాన్ చుంగ్ నింజాస్ మార్షల్ ఆర్ట్స్ డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫు అకాడమీ తెలంగాణ రాష్ట్రస్థాయిలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే ఛాంపియన్ షిప్ -2026 రాయికల్ పట్టణానికి చెందిన ముక్కేర శ్రీచందన,గంగాధరి హన్షీత్, కండ్లపల్లి శశాంక్ చందోలి ప్రణీత, గంట్యాల హర్షిత్, హరిని బొమ్మ కంటి రుగ్వేద్, శ్రీయాన్స్ ,కడకుంట్ల సాత్విక్ పెరుమండ్ల విహరిలు బంగారు పతకాలు,వేల్పుల సాత్విక్, యశోద సాహిత్య, పెరుమండ్ల విశ్వశ్రీలు వెండి పతకాలు, ఇంద్రాల చైత్రిక, వేల్పుల ప్రహర్షిత, స్తంభం నిత్యలు విద్యార్థులు బంగారు పథకం ప్రశంస పత్రం సాధించగా విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుర్రె శ్రీధర్,నాయకులు తురగ శ్రీధర్,అడ్వకేట్ మచ్చ శేఖర్,బత్తిని నాగరాజు,కునారపు భూమేష్,వేముల రాము,కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ అర్జున్, విద్యార్థులు ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | March 09, 2026 | 0 Comments