కొత్తపెల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు రాయికల్ మండలంలోని మైతాపూర్, భూపతిపూర్ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధ్దాంతకర్త, ఉద్యమ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జయశంకర్ గారి జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయపాలన కార్యశూరత వంటి మంచి లక్షణాలను ఆయన స్ఫూర్తితో విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.