బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులలో మరణించిన హిందువులకు నివాళ్ళు అర్పిస్తూ బంగ్ల హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన రాయికల్ పట్టణ బంద్ తో మంగళవారం పట్టణంలోని హోటల్లు వ్యాపార సంస్థలు మూసివేశారు. విద్యా సంస్థలు, హోటల్లు, షాపింగ్ సెంటర్లు అందరూ స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నాయి. అయితే ఈ బంద్ లో అత్యవసర సేవలకు సంబంధించి మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మినహించారు. హిందూ ఐక్యవేదిక నాయకులు పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలలో కలియ తిరుగుతూ బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు తీసుకోకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతకల్పించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.