|
modi add 1

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు బుగ్గిపాలు.. మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత.... మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలో అందరి బాధ్యత బి ఎం ఎస్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్.. గురు వారం ఒక ప్రకటనలో కోరారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైన బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా అధికంగా జరుగుతుందని పోలీసు యంత్రాంగం దృష్టిసారించి నిర్వహించాలన్నారు. పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. పెడదారి పడుతున్న యువత కు కళాశాలల్లో కౌన్సిలింగ్ కల్పించాలని తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తన పై దృష్టి సాధించాలని సూచించారు. యువతను పెడదోవ పట్టిస్తున్న వ్యాపార వర్గాల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments