సుల్తానాబాద్,అక్టోబర్ 29 (జనం గొంతు) : బిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోతున్నట్లు బిఆర్ఎస్ నాయకులు ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు అన్నారు. ఆదివారం ఎలిగేడు మండలంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని గత రెండు పర్యాయాలు దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కొరకు తన వంతు కృషి చేశానని, అయినా పార్టీలో గుర్తింపు లేదని ముఖ్యంగా గత ఎన్నికల్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ బుర్ర వీర స్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తెలిపారు.విజయ రమణారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటా అని ఆయన అన్నారు.
పూర్ణచంద్రరావు గారి వివహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు& పిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
ఈరోజు మంగపేట మండలంలోని పురేడ్పల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్.కె అజ్మత్ కుమార్తెల అఖిక కార్యక్రమానికి సీతక్క గారి పిలుపు మేరకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరు యానయ్య,మండల వర్కింగ్ ప్రెస్సిడెంట్ చెట్టుపల్లి వెనకటేశ్వర్లు, జిల్లా బిసి సెల్ ప్రధానకార్యదర్శి కాటబోయిన నర్సింహారావు,పూజారి సమ్మయ్య,సింగిల్ విండో డైరెక్టర్ కోడెం బాలకృష్ణ,మండల పార్టీ ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,మైనారిటి సెల్ అద్యక్షులు హిదయితుల్ల, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేశగిరి,సురేష్,ఖాన్,యూత్ నాయకులు చెట్టుపల్లి ముకుందాం,అరవింద్,సతీష్ తదితరులు పాల్గొన్నారు..
పట్టణంలో పీర్లగుట్టపై ప్రజల ఆర్తనాదాలు వినండి. గొంతు ఎండిపోతున్న ప్రజలకు నీరు తాపండి ప్రజాప్రతినిధులారా అధికారులారా ప్రజలు కట్టిన పన్నుపై జీతాలు తీసుకొని వారి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా? వారికి సేవ చేయoడని డబల్ బెడ్ రూమ్ లో నివసించే ప్రజలకు పలు కష్టాలు ఉన్నాయని వాటిని వెంటనే తీర్చాలని ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వెళ్లి పరిశీలించి డిమాండ్ చేసింది. వనపర్తి లో నెలకొన్న సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక మోటార్ సైకిళ్ల పై తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలుసుకొని బహిరంగ లేఖ రాస్తూ పత్రికా ముఖంగా పాలకపక్షాలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి పలు డిమాండ్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉండే పలు పార్టీల నాయకులతో కలిసి మోటార్ సైకిళ్ల పై బయలుదేరి డబల్ బెడ్ రూమ్ ల సమస్యలపై తిరుగుతూ పీర్లగుట్ట ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదికకు ఇచ్చిన దరఖాస్తు పై వెళ్లి చూడగా అక్కడ నీటి సమస్య, కరెంటు సమస్య, శానిటరీ సమస్యలు రోడ్డు సమస్యలతో విలవిలలాడుతున్నారని వారి ఆర్తనాదాలు ఎవరికి వినిపించలేదని, రాజకీయాలు విడిచిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బింగి అనిల్ కుమార్ మరియు కార్పొరేటర్లు BRS పార్టీని వీడి రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కండవాకప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు
వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ గారికి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ, వారసత్వ, అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీ గారికి కుటుంబం లేదని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కుటుంబమే ఫస్ట్ అని పనిచేస్తుంటే... మోదీ గారు మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారన్నారు. 140కోట్ల దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులని మోదీజీ భావిస్తారని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మోదీకి బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. మేరా భారత్ - మేరా పరివార్ అనే భావనతోనే మోదీజీ జీవిస్తున్నారని,.. ప్రతిక్షణం ప్రజలకు సేవ చేసేందుకే ఆలోచిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు శ్రమిస్తారని గుర్తుచేశారు. అందుకే, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో దేశ ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి 90 రోజులు గడిచినా కూడా అమలు చేయలేకపోతున్నారని చురకలు అంటించారు. కేసీఆర్ అడుగుజాడల్లో, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిలిచేది, గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు: దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే మోదీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోదీజీ భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదు. రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్న మోదీ గారిని చూసి దేశ ప్రజలు ముగ్ధులవుతున్నారు. అందుకే దేశమంతా ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్ అని నినదిస్తోంది. వంశ పారంపర్యంగా రాజకీయాలు చేస్తున్న వారు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ , నెహ్రూ కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తోంది. కేసీఆర్ కుమారిడినో, కూతురునో ముఖ్యమంత్రిని చేయడానికి బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారు. ఇలాగే తమిళనాడు తో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుటుంబం కోసం పని చేస్తున్నాయి. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మోదీ గారు ‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్ఫార్మెన్స్’ అనే నినాదంతో రాజకీయాల యొక్క నిర్వచనం మార్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కుటుంబమే ఫస్ట్ అని చేస్తుంటే...మోదీ గారు మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం.. దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పనిచేస్తోంది. దేశంలో జరుగుతన్న అభివృద్ధి నుండి ప్రజల యొక్క దృష్టి మళ్లించడంకోసం కుటుంబ పార్టీలు కుట్రలు పన్నుతున్నారు. ప్రజలను వంచించి మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అందరికి అన్నీ అని చెప్పి, ఇప్పడేమో ప్రభుత్వ పథకాలు కొందరికి కొన్నే అంటూ షరతులు పెడుతోంది. మహాలక్ష్మి పధకం లో భాగంగా మహిళలకు రూ. 2,500 ఇస్తామని చెప్పారు.. ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి.. అధికారం లోకి వచ్చాక కొందరికే అని ఆంక్షలు పెడుతున్నారు. గృహ జ్యోతి పధకం ద్వారా అందరికీ 200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితం అన్నారు.. ఇప్పుడు రూ.200 మించి ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా మొత్తం భారం ప్రజలపై వేస్తామంటున్నారు.. రైతులకు రూ. 15 వేల చొప్పున, రైతు కూలీలకు రూ. 12 వేల చొప్పున భరోసా కల్పిస్తామన్నారు. రైతు భరోసా లేదు.. కూలీ భారోసాలేదు. 90లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉంటే 40లక్షల మందికే పరిమితం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి..ఇప్పుడు 5లక్షలు ఇస్తామంటున్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పారు.. ఆ ఊసే లేదు. రైతు రుణమాఫీ లేదు..రైతు భరోసా లేదు. కూలీ భరోసా కూడా లేదు. రైతు బంధు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా 6 గ్యారెంటీలని తప్పుడు వాగ్ధానాలు చేసి ప్రజలను మోసం చేశారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడుతున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుంది. ఇదిగో పులి అంటే..అదిగో తోక అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోంది. మోదీ గారిని ఎదుర్కోలేక మూడు పార్టీలు ఒక్కటవుతున్నాయి. ప్రధాని మోదీ గారు రెండు రోజుల పాటు తెలంగాణ పర్యటనలో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే దాని గురించి మాట్లాడలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎదురుదాడి చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో మోదీ నామంతో బీజేపీ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేయడానికి వాళ్ల నాయకులు ముందుకు రావడం లేదు. ఒత్తిడి చేసి పోటీలో పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలు పెట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయ రూపురేఖలు మారబోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉంది. మోదీ మయం అయిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే వారిని కనీసం నిలువరించడం లేదు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కనీసం నోరు మొదపలేదు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలైంది. భారత్ ను ధ్వేషించడమే కాంగ్రెస్ పార్టీ విధానం. దేశాన్ని వ్యతిరేకించడం, రామున్ని ధ్వేషించడం, పాకిస్తాన్ మీద ప్రేమ కురింపించడం దేనికి సంకేతం..?? హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న పార్టీలకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. మార్చి 12వ తేదీన అమిత్ షా గారు బూత్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు ఎదుర్కోవడానికి మండల స్థాయి సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశాల ఏర్పాటుకు రూపకల్పన చేశాం. తెలంగాణలో నిలిచేది, గెలిచేది బీజేపీ మాత్రమే. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. బీజేపీని ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకున్నారు. గడీల పాలన, రాచరిక వ్యవస్థతో కొందరు చేతులు కలుపుతున్నారు. ఎవరు ఏక్ నాథ్ షిండో, ఎవరు కట్టప్పలో మేం జోస్యం చెప్పం. తెలంగాణలో బలమైన పునాదులు నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో ప్రజలు గమనిస్తున్నారు. బలమైన పునాదులతో డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో ఏర్పడబోతోంది. ఎప్పుడనేది ప్రజలు నిర్ణయిస్తారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం పైన సీబీఐ దర్యాప్తు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు..? బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం కొనసాగుతుంది చేరికలను ఆహ్వానించాలని హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు మరియు భూపాలపల్లి మండలం సెగ్గంపల్లి బొగ్గు కంటా లోడింగ్ ఆన్ లోడింగ్ కార్మికులు సుమారు 300 మంది సోమవారం *భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అట్టర్ ప్లాప్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం... * కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలి * పెద్దపల్లి పార్లమెంట్ సీటు బిజెపిదే * బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి,మే20 (జనం గొంతు): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందని బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని,రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని,కళ్ళల్లో ఉన్న వడ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలని,తడిచిన ధాన్యాన్ని, ఎలాంటి కోత లేకుండా కొనాలని,రైతులకు అండగా బిజెపి ప్రభుత్వం ఉంటుందని, జాతీయస్థాయిలో రైతులను ఆదుకునీ అనేక సబ్సిడీలు ఇచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని అన్నారు.అదేవిధంగా పార్లమెంటరీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ 10 సంవత్సరాల సుపరిపాలన పై విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు,బిజెపి గెలుపు కోసం ప్రతి గ్రామ గ్రామాన పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో బిజెపి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, పార్లమెంట్ కో కన్వీనర్ లక్ష్మణ్ యాదవ్, తంగడ రాజేశ్వరరావు, పోసాని సంపత్ రావు, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
తా గెలువనమ్మమ తానోడి గెలిచినమ్మ ఓడేనని ప్రచారం చేసుకుందట అల వుంది కాంగ్రెస్ పరిస్థితి. గడిచిన 78 ఏండ్ల లో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారం చలయించింది. ఇన్నాళ్ళు అనుభవించిన అధికార దాహం ఇంకా తీరక పోవడం తో ఎంతటి విశాప్రచారనికైన దిగజారుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, దాని పెద్దలు RSS మీద తప్పుడు ప్రచారం చేస్తూ పట్టుబడ్డారు . మనీష్ తివారీ, జైరామ్ రమేష్ లాంటి వాళ్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వదిలి — “RSS 1925 నుంచి 1947 వరకూ ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు” అని అబద్ధం పండిస్తున్నారు. కానీ ఆ పేపర్ కాస్త దగ్గరగా చూసామంటే — అదంతా పూర్తిగా AIతో తయారైన కట్టుకథే RSSని చెడుగా చూపించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ మరో కొత్త సాహసం చేసింది అంతే. RSS సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు “RSS శతాబ్దోత్సవం – కొత్త దిశలు” అనే మూడు రోజుల కార్యక్రమం న్యూ ఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించబోతున్న సమయంలోనే, కాంగ్రెస్ ఈ ఫేక్ ప్రచారం వదిలింది. 🤖 AIతో తయారైన ఫేక్ పేపర్ కాంగ్రెస్ వాళ్లు పంచిన ఆ డాక్యుమెంట్ ఏ చరిత్ర పత్రం కాదు AIతో తయారైన నకిలీ పేపర్. ఆ పేపర్లో “British Home Department” అని రాసి ఉంది, కానీ బ్రిటిష్ ఇండియా కాలంలో అలాంటి శాఖ అసలే లేదు. ఈ ఒక్క విషయం చాలు — అది ఫేక్ అని వెంటనే అర్థమైపోతుంది. 🦁 వక్రీకృత సీల్, అర్థం లేని పదాలు ఆ పేపర్లో ఉన్న సీల్ కాపీ పేస్ట్ చేసినట్టుంది. అసలైన బ్రిటిష్ ఎంబ్లమ్ మోటో “Dieu et mon droit” (దేవుడు మరియు నా హక్కు) — కానీ కాంగ్రెస్ వాళ్ల ఇమేజ్‌లో “Dieu Droit” అని ఉంది. అదేమో అర్థమే లేని పదం! సీల్ మీద ఉన్న సంతకాలు కూడా గజిబిజిగా, AI పుట్టించిన వాటిలానే ఉన్నాయి. 📝 తప్పు పేర్లు, తప్పు పదజాలం ఇంకో పెద్ద పొరపాటు ఏమిటంటే — ఆ పేపర్లో “RSS” అని వాడారు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ఎప్పుడూ “R.S.S.S.” అని మాత్రమే వాడేది. అందువల్ల ఈ డాక్యుమెంట్ పూర్తిగా కట్టుకథ అని స్పష్టమవుతుంది. ఇదంతా చూసినప్పుడు తేలిపోతుంది — కాంగ్రెస్ RSS మీద ఫేక్ AI పరికరాలతో దుష్ప్రచారం చేస్తోందని. దేశానికి సేవ చేసిన వారిని గౌరవించకుండా, రాజకీయ కసితో అబద్ధాలు పండిస్తోంది. ✊ సంఘ్ – సత్యాగ్రహం RSS స్థాపకుడు 1930లో గాంధీ గారు చేసిన దండి యాత్రలో RSS స్థాపకుడు డా. హెడ్గేవార్ గారు కూడా పాల్గొన్నారు. RSS సర్‌సంఘ్‌చాలక్ పదవి వదిలేసి, స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు వచ్చారు. ఆయన కూడా జైలుకెళ్లారు. హెడ్గేవార్ గారు ఎప్పుడూ చెప్పేవారు — “దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేటప్పుడు అందరూ కాంగ్రెస్ కింద ఏకం కావాలి. అదేవిధంగా RSSలో ఉండి హిందూ సమాజం లో రావాల్సిన సంస్కరణలు మరియు సంఘటనా కార్యం చేయాలి అని చెప్పారు 1930 జూలై 21న యవత్మాల్‌లో ఆయన చేసిన సత్యాగ్రహం తర్వాత, తొమ్మిది నెలల కఠిన శిక్ష విధించారు. 100కి పైగా స్వయంసేవకులు అకోలా జైలుకి పంపబడ్డారు RSS ప్రాభవం పెరుగుతున్న క్రమంలో, బ్రిటిష్ ప్రభుత్వం 1932లో ప్రభుత్వ ఉద్యోగులు RSS కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆదేశం జారీ చేసింది. 1933లో బ్రిటిష్ సెక్రటరీ MG హాన్లెట్ RSSపై సమాచార సేకరణ ఆదేశించాడు. డిసెంబర్ 1933లో RSSని “కమ్యూనల్” అని ముద్ర వేసి, ప్రభుత్వ టీచర్లు సభ్యులు కాకూడదని చెప్పాడు. కానీ 1934లో మధ్యప్రాంత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులే ముందుకొచ్చి — “RSS మీద నిషేధం తీయాలి” అని బహిరంగంగా మాట్లాడారు. 🇮🇳 క్విట్ ఇండియా ఉద్యమంలో RSS పాత్ర డా. హెడ్గేవార్ గారి మరణం (1940) తర్వాత, శ్రీ గురుజీ గోల్వాల్కర్ నాయకత్వంలో RSS స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు విదర్భ ప్రాంతం మొత్తం RSS కార్యకలాపాలతో కదిలిపోయింది. RSS కార్యకర్తలు దాదా నాయక్, బబురావ్ బేగాడే, అన్నాజీ, కాంగ్రెస్ నాయకుడు ఉద్ధవరావు కోరేకర్ లతో కలిసి ఉద్యమం నడిపారు. ఈ పోరాటంలో యువ స్వయంసేవకుడు బాలాజీ రాయపుర్కర్ ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత జరిగిన చిమూర్ ఘటన (చిమూర్-అష్టీ ఎపిసోడ్)లో 125 మంది సత్యాగ్రహీలు, వేలాది స్వయంసేవకులు జైలుకెళ్లారు. హేము కలాని, దాదా నాయక్ లకు మరణదండన విధించారు. 1943లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో స్పష్టంగా రాసి ఉంది — “RSS అసలు లక్ష్యం బ్రిటిష్‌వాళ్లను భారత్ నుంచి తరిమేయడమే. స్వయంసేవకులు దేశంకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.” — ఈ మాటలకంటే పెద్ద సాక్ష్యం ఏదీ ఉండదు! ☭ కమ్యూనిస్టుల అసలు ముఖం అదే కాలంలో కమ్యూనిస్టులు మాత్రం స్వాతంత్ర్య ఉద్యమానికి దూరంగా ఉండి, “భారత స్వాతంత్ర్యం అసలు నిజమైనది కాదు” అని పిలిచారు. రాజ్యాంగాన్ని కూడా “బుర్జువా పత్రం” అని తిట్టేశారు. కానీ నిజం ఏంటంటే — ఇలాంటి ఫేక్ ప్రచారాలతో RSS స్వయంసేవకుల త్యాగాలు చెరగవు. వాళ్లు చేసిన సేవ, త్యాగం వల్లే ఈ దేశం ఈ రోజు బలంగా నిలిచింది. RSS స్వయంసేవకులే “భారత భవిష్యత్తు”కి నడకరాళ్లు అయ్యారు. వాళ్లు చేసిన కృషిని ఎవరూ చెరపలేరు — అది చరిత్రలో బంగారు అక్షరాలతో ఉంది.