సోమవారం రోజునగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత, పచ్చధనాన్ని పెంచుటకై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకముగా చేపట్టబోతున్నటువంటి “ స్వచ్చదనం - పచ్చదనం “ కార్యక్రమము రాయికల్ మండలములోని అన్ని గ్రామాలలో ప్రారంభించడం జరిగినది. ఇందులో భాగంగా మండల ప్రత్యేకాధీకారి అయిన శ్రీ యం. సంపత్ రావు , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగిత్యాల ఇటిక్యాల, భూపతిపూర్ గ్రామాలు సందర్శించడం జరిగినది. కార్యాచరణలో భాగంగా గ్రామములో శ్రమదానం నిర్వహించడం జరిగినది, అలాగే స్కూల్ పిల్లలకి ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం, శానిటేషన్ పై వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయడమైనది. అలాగే గ్రామములో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రత, పచ్చధనాన్ని పెంచుటకై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో మండల ప్రత్యేకాధికారి శ్రీ యం. సంపత్ రావు , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారు, ఎంపీడీఓ శ్రీ బి. చిరంజీవి గారు, ఎంపీ ఓ శ్రీమతి కె. సుష్మ గారు, ఏపీఎం చక్రవర్తి గారు, ఏ పీ ఓ యం. దివ్య గారు ఆయా గ్రామాల పంచాయతి కార్యదర్శి గార్లు మరియు వివిధ మండల , గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.