రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత మరియు వాటి వలన లాభాల గురించి వివరించి చెప్పడం జరిగింది. పాప పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని తెలియజేయడం, గర్భిణీలకు శ్రీమంతాలు ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనలు మరియు మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మహిళా సాధికారత గూర్చి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ మహిళల హెల్ప్ లైన్ గూర్చి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సెక్టార్ సూపర్వైజర్ పద్మావతి ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి రజిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, కారోబార్ కిషోర్, ఆశ వర్కర్లు వనిత, రమ, సుమలత, లక్ష్మి, అనురాధ,అంగన్వాడి టీచర్స్ సుజాత, బుజ్జమ్మ సహారా సువర్ణ, అనురాధ, వివో ఏ లు లావణ్య, రాధ మరియు గర్భిణీలు బాలింతలు తల్లులు పాల్గొన్నారు మహిళా సాధికారత గూర్చి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ మహిళల హెల్ప్ లైన్ గూర్చి తెలియజేయడం జరిగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.