పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన మేడేను బహిష్కరించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరపాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా మే డే ను నిర్వహిస్తలేరు కానీ మనదేశంలో మాత్రం ఉనికి కోసం స్వలాభాల, రాజకీయాల కోసం కొంతమంది మే డేను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ సప్త కులాలకు పనిముట్లు అందించిన ఆది గురువు విశ్వకర్మ ని కొనియాడారు. అలాంటి మహానుభావు ల జయంతిని నిర్వహించకుండా ఎక్కడో ఏదో జరిగిందని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని స్వదేశం తిండి తింటూ విదేశీ పాట పాడుతున్నారని విదేశీ సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశ కార్మికులపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలతో నేటికీ కార్మిక వర్గానికి న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా భారత కార్మిక దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.