|
modi add 1

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని

జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని నిజామాబాదు : ఇటీవల మెదక్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ లో మెరుగైన ప్రతిభ కనబరిచిన బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న Y.ప్రజ్ఞ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయస్థాయి కి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ ప్రసన్నకుమారి విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 6 నుంచి 10 తేది వరకు జమ్మూ కాశ్మీర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఆటలలో ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థినిని అభినందించారు.

By NYALAKONDA ANIL DESAI | November 26, 2024 | 0 Comments