రాయికల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో బుధవారం మార్కండేయ జయంతి సందర్బంగా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శివ భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి గణపవరపు మల్లికార్జున శర్మ మార్కండేయ మహర్షికీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సందర్భంగా మార్కండేయ మహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరించి వారి అద్భుతమైన లీలలను భక్తులకు కథా రూపంలో తెలియజేశారు పూజానంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ రాజేశం, ఉపాధ్యక్షులు దాసరి గంగాధర్, కార్యదర్శి కడుకుంట్ల నరేష్, కోశాధికారి ఆడెపు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, సహాయ కార్యదర్శులు అనుమల్ల చంద్ర తేజ, గంట్యాల ప్రవీణ్, తాటిపాలు విశ్వనాథం, అష్టమ వాడ పెద్దలు, గూడూరి పొట్టన్న, కట్టేకోల భాస్కర్, శ్రీను, వాసం నర్సయ్య, మాచర్ల మారుతి, మాజీ పదాదీ కారులు మామిడాల లక్ష్మీనారాయణ, కడకుంట్ల ప్రభాకర్, అనుమల్ల రమణ, పద్మశాలి కులబంధావులందరు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.