నియామక పత్రం అందజేసిన రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరహరి జగ్గా రెడ్డి. రెడ్డి సంక్షేమ సంఘ భూముల ఆక్రమణల పై న్యాయంగా పోరాడి తిరిగి స్వాధినపరుచుకుంటాం. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి వెల్లడి. రాజా బహద్దూర్ వెంకటరామా రెడ్డి విజ్ఞాన పరిషత్ (రెడ్డి సంక్షేమ సంఘం) కరీంనగర్ ఉమ్మడి జిల్లా న్యాయ సలహాదారుడిగా కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ని రెడ్డి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు నరహరి జగ్గా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా న్యాయ సలహాదారుడిగా ఎన్నికైన బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్.బి.వి.అర్.అర్ రెడ్డి సంక్షేమ సంఘం నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్దతో పని చేస్తానని, అలాగే ఎలాంటి అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ఏదురొడ్డి పోరాడుతూ సంఘ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే కాకుండా గతంలో జరిగిన రెడ్డి సంఘం భూముల ఆక్రమణల పై కూడా న్యాయస్థానంలో పోరాడి తిరిగి ఆ భూములను స్వాధినపరుచుకునే దాకా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని బేతి మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ తన నియామకానికి సహకరించిన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి లతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గన్ను మహేశ్వర్ రెడ్డి, దారం జగన్నాథ రెడ్డి, ఎడమ శేఖర్ రెడ్డి, గుజ్జుల రేష్మ, చింతల శ్రీనివాస్ రెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, రాయిరెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.