ఓదెల //జనం గొంతు// సతీష్ కుమార్ పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో గుండారం రాజయ్య 62 సంవత్సరాలు గల వ్యక్తి తాను రోజు చేసుకునే పనిలో భాగంగా ప్రతిరోజు చేసేలా ఈరోజు కూడా తాను కౌలుకు చేస్తున్న భూమియందు కరెంటు మోటార్ స్టార్ట్ చేయుటకు వెళ్లి అప్పటికే తెగి ఉన్న కరెంటు వైర్లను గమనించక వాటిని తాకటంతో రాజయ్య అక్కడికక్కడే మరణించారు రాజయ్య మృతదేహం వద్ద బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు అల్లంటాయి కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది కనగర్తి గ్రామ ప్రజలు దిబ్బ్రాంతి గురయ్యారు ఈ యొక్క విద్యుత్ ఘాతకం రైతు నడిచే ఒడ్డుపై గల కరెంటు తీగల లో విద్యుత్ ప్రవాహం ఎడమ నుంచి కుడికి జరుగుతుంది కానీ ఎడమ విద్యుత్ స్తంభం నుండి విద్యుత్ తీగలు తెగిపోవడం జరిగింది అటువంటి సందర్భంలో కరెంట్ అనేది తీగలకు రాకూడదు కానీ ఆ రైతు తీగల కు తగలగానే విద్యుత్ ఘాతంతో మరణించాడు కరెంట్ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ విద్యుత్ ఘాతానికి రైతు మృతి మిస్టరీగా మారింది మృతుడికి మూగ భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలదు మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోత్కాపల్లి ఎస్సై అశోక్ రెడ్డి సంఘటన సంఘటన స్థానానికి చేరుకొని మృతి చెందడానికి గల కారణాలను పరీక్షించి మృతుని కుమారుడు గుండారం శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు సంఘటన స్థలానికి విద్యుత్ ఏఈ మోహన్ నాయక్ మరియు విద్యుత్ సిబ్బంది చేరుకొని సంఘటన గల కారణాలను ఎస్ఐ గారికి వివరించారు సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కారణాలను తెలుసుకున్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.